Skip to content
BREAKING
LIVE

మీ ఆస్తుల లెక్క తేలుస్తా..

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

మీ ఆస్తుల లెక్క తేలుస్తా..

మీ ఆస్తుల లెక్క తేలుస్తా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్!

హైదరాబాద్, సెప్టెంబర్ 30: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తుల వివరాలపై ధైర్యముంటే తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మాదాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో ఉన్న పలు స్టార్/ఫైవ్ స్టార్ హోటళ్ళు కేసీఆర్ కుటుంబ సభ్యులు లేదా వారి అనుచరుల పేరిట లేవని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అవి వారివేనని తాను నిరూపిస్తానని, నిరూపించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల పేరిట ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులు, భూములు కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ కుటుంబీకుల పేరిట ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ కుటుంబానికి అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. దుబాయ్ పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుక్కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు..

#political#cm#revanth reddy#kcr#properties
ShareXFacebook
Editorial Desk
Editorial Desk · Editor in Chief

The editors of this publication. Replace with your real editors in News Desk → Authors.

Reader Comments

Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.