ఆవేదనతో అత్యవసర విజ్ఞప్తి.. బాలుడిని రక్షించండి!
వీడియోలో బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ..
ఆవేదనతో అత్యవసర విజ్ఞప్తి.. బాలుడిని రక్షించండి!
రాచవారిపాలెం సమీపంలో 8 ఏళ్ల బాలుడు గొర్రెలు మేపుతూ కనిపించినట్లు సమాచారం. బాలుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.
వీడియోలో బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ..
“అన్నా.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. నాకు అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదు.. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను” అంటూ వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
విచారించగా బాలుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం, నర్రవాడ గ్రామానికి చెందినవాడిగా తెలిసినట్లు సమాచారం.
ఇంత చిన్న వయసులో బాలుడు గొర్రెలు మేపుతున్న పరిస్థితిపై అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. బాలుడు ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు? అతనితో ఎవరు పని చేయిస్తున్నారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలి.
మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెంటనే స్పందించి బాలుడిని గుర్తించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
బాలుడికి అవసరమైన వైద్యం, ఆహారం, రక్షణ అందించి, అతని పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించాలి. వాస్తవాలు తేలిన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
📞 బాలుడి ఆచూకీ లేదా ఘటనకు సంబంధించిన సమాచారం ఉన్నవారు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వండి.
ఒక చిన్నారి కన్నీటి విజ్ఞప్తి అధికారుల దృష్టికి చేరాలి..
ఆ బాలుడికి సురక్షితమైన భవిష్యత్తు కల్పించాలి.




Reader Comments
Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.