అక్టోబర్ 1 నుంచి ఎన్పీఎస్ (NPS) కొత్త ఛార్జీలు అమలు

హ్యూమన్ రైట్స్ టుడే: అక్టోబర్ 1 నుంచి ఎన్పీఎస్ (NPS) కొత్త ఛార్జీలు అమలు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో అక్టోబర్ 1 నుండి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (PoP) సేవల కోసం కొత్త ఫీజు విధానాన్ని ప్రకటించింది. కొత్త ఖాతా తెరిచేందుకు రూ. 200 వన్-టైమ్ ఛార్జ్, అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్‌లో వార్షికంగా 0.20% ఛార్జ్ వర్తిస్తుంది. నేరుగా ఆన్‌లైన్‌లో చేసే వారికి PoP ఛార్జీల మినహాయింపు లభిస్తుంది. ఖాతా తెరిచే సమయంలో కనీసం రూ. 250, తర్వాతి విరాళాలకు రూ. 10 కనీస విరాళం అవసరం.




Reader Comments
Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.