సుప్రీంకోర్టు కొరడా దెబ్బ - కబ్జాదారుల ఆట కట్టు!

- పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే!
- 12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు!
- సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం!
సుప్రీంకోర్టు కొరడా దెబ్బ - కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే!
12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం
ప్రియమైన తెలంగాణ రైతు సోదరులారా,
మీ భూమి మీద మీరే వెళ్లలేని పరిస్థితి. పేపర్లు మీ చేతిలో ఉన్నాయి, కానీ భూమి మీద దున్నేది వేరే వాడు. MRO ఆఫీసుకు వెళ్తే "పహాణీలో వాడి పేరు ఉంది" అంటాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే "సివిల్ మేటర్" అంటాడు. లాయర్ దగ్గరకు వెళ్తే "12 ఏళ్లు దాటింది కదా, ఇక భూమి వాడిదే" అని భయపెడతాడు
ఈ దోపిడీ రాజ్యానికి సుప్రీంకోర్టు ఇప్పుడు సమాధి కట్టింది. మొన్న 10 రోజుల క్రితం వచ్చిన తీర్పుతో కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది
అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సూటిగా, స్పష్టంగా, మన భాషలో...
తీర్పు - 1: పహాణీలో పేరు ఉంటే నువ్వు ఓనర్ వు కావు! నువ్వు దొంగవి!
కేసు: భగ్ సింగ్ vs పంజాబ్ రాష్ట్రం (సెప్టెంబర్ 2026 తాజా తీర్పు)
సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కఠినంగా చెప్పింది. కోర్టు మాటల్లోనే చెబుతున్నా
"రెవెన్యూ రికార్డులు, జమాబందీ, ఖస్రా గిర్దావరి, పహాణీ - ఇవి కేవలం భూమి ఎవరి చేతిలో ఉందో చెప్పేందుకే తప్ప, భూమి ఎవరిదో చెప్పేందుకు కాదు. ఇవి టైటిల్ ను సృష్టించవు. ఇవి కేవలం పన్ను వసూలు కోసం రాసుకునే లెక్కల పుస్తకాలు మాత్రమే."
అంటే ఏంటి?
నువ్వు ఒకడి భూమిని కబ్జా చేసి, MRO కి లంచం ఇచ్చి, పహాణీలో నీ పేరు రాయించుకుంటే నువ్వు ఓనర్ అయిపోయినట్టా? కానే కాదు. కోర్టు దృష్టిలో నువ్వు ఇప్పటికీ కబ్జాదారుడివే, దొంగవే
అసలు ఓనర్ ఎవరు?
ఎవరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందో, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయో, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయో - వాడే అసలైన ఓనర్. వాడే రాజు. పహాణీ కాదు, పేపరే ప్రాణం
తీర్పు - 2: 12 ఏళ్ల డ్రామాకు ఫుల్ స్టాప్ - అడ్వర్స్ పొసెషన్ అంటే ఏమిటి?
కబ్జాదారులు కోర్టులో వాడే బ్రహ్మాస్త్రం - "అడ్వర్స్ పొసెషన్". అంటే "నేను 12 ఏళ్లుగా ఈ భూమిలో ఉన్నాను, కాబట్టి Limitation Act ప్రకారం ఇది నాదే" అని
దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు తుంగలో తొక్కింది. కోర్టు ఏం చెప్పిందంటే
"కేవలం ఎక్కువ కాలం కబ్జాలో ఉంటే భూమి నీది కాదు 12 ఏళ్లే కాదు @ 100 ఏళ్లు ఉన్నా నీది కాదు. అడ్వర్స్ పొసెషన్ నిరూపించాలంటే కబ్జాదారుడు 3 పరీక్షలు పాస్ కావాలి."
ఆ 3 పరీక్షలు ఏమిటి?
1. బహిరంగ పరీక్ష:
నువ్వు దొంగచాటుగా కబ్జా చేయలేదు, ఊరందరికీ తెలిసేలా చేశానని నిరూపించాలి
2. నిరంతర పరీక్ష:
12 ఏళ్లు ఒక్క రోజు కూడా భూమిని వదిలి వెళ్ళలేదని నిరూపించాలి. మధ్యలో 2 నెలలు ఊరికి వెళ్తే నీ కేసు పోయినట్టే
3. అతి ముఖ్యమైన పరీక్ష - వ్యతిరేక భావం (Hostile Intent):
ఈ భూమి నాదే, అసలు ఓనర్ కి దీనితో సంబంధం లేదు, వాడి హక్కును నేను సవాలు చేస్తున్నాను" అని నువ్వు అసలు ఓనర్ కి బహిరంగంగా, రాతపూర్వకంగా ఎప్పుడు చెప్పావో ఆ తేదీని కోర్టులో చెప్పాలి. ఆ తేదీ నుండి 12 ఏళ్లు లెక్క
ఈ మూడింటిలో ఒక్కటి తేడా వచ్చినా, కబ్జాదారుడి కేసు డిస్మిస్ వాడు జైలుకే
చాలా మంది కబ్జాదారులు ఈ 3 వ పరీక్షలోనే ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ఓనర్ కి "ఈ భూమి నాదే" అని చెప్పరు, దొంగచాటుగా దున్నుకుంటారు
తీర్పు - 3: ప్రభుత్వమే కబ్జా చేస్తే తప్పు అన్నప్పుడు, సాధారణ వ్యక్తుల సంగతి ఏమిటి?
కేసు: విద్యాదేవి vs హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం
➡️ ఒక నిరక్షరాస్యురాలైన వితంతువు భూమిని ప్రభుత్వమే రోడ్డు కోసం లాక్కుంది సుప్రీంకోర్టు ఆగ్రహించింది
➡️ ప్రైవేటు ఆస్తి అనేది మానవ హక్కు రాజ్యం ఒక కబ్జాదారుడిలా ప్రవర్తించి, పౌరుడి భూమిని లాక్కొని, తర్వాత అడ్వర్స్ పొసెషన్ పేరుతో అది మాదే అంటే కుదరదు. అలా చేస్తే రాజ్యమే ఆక్రమణదారుడు అవుతుంది" అని చెబుతూ, ప్రభుత్వానికి కోటి రూపాయల జరిమానా వేసింది
➡️ ప్రభుత్వానికే ఈ శిక్ష పడితే, ఇక మన ఊళ్లో కబ్జా చేసిన ఆ రౌడీకి ఏం శిక్ష పడాలో ఆలోచించండి
ఈ తీర్పులతో మనం ఏం చేయాలి ? రైతులకు నా సూచనలు:
1. పేపర్లే దేవుడు:
మీ రిజిస్ట్రేషన్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ, పాత పహాణీలు - వీటిని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోండి. జిరాక్స్ లు తీసి బ్యాంకు లాకర్ లో పెట్టండి
*(2) వెంటనే లీగల్ నోటీసు: మీ భూమి ఎవరైనా కబ్జా చేస్తే, వెంటనే ఒక లాయర్ తో రిజిస్టర్ పోస్టులో నోటీసు పంపండి. "నా భూమిని ఆక్రమించావు, తక్షణమే ఖాళీ చేయి" అని. ఈ నోటీసు వల్ల వాడు ఇక ఎప్పటికీ "నేను వ్యతిరేక భావంతో ఉన్నాను" అని చెప్పలేడు
(3) దొంగ లాయర్ల మాట నమ్మకండి : 12 ఏళ్లు దాటింది, ఇక నీ భూమి రాదు, రాజీ పడు" అనే లాయర్లకు ఈ తీర్పు కాపీని ముఖాన కొట్టండి
(4 ) ఇది క్రిమినల్ కేసు కూడా కేవలం సివిల్ కేసే కాదు, కబ్జా చేయడం BNS సెక్షన్ 329 ప్రకారం క్రిమినల్ నేరం. పేపర్లు మీవైతే, పోలీస్ స్టేషన్ లో కూడా FIR పెట్టవచ్చు
చివరగా ఒక మాట:
తెలంగాణ లో ఇన్నాళ్లు 'కబ్జా చేసినోడిదే రాజ్యం' నడిచింది డబ్బు, అధికారం,రౌడీయిజం ఉన్నోడు భూములు లాక్కున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు దొంగవాడు జైలుకే అని తేల్చింది.
ఈ ఆర్టికల్ ను ప్రతి రైతు గ్రూపులో షేర్ చేయండి. ప్రతి పంచాయతీ గోడ మీద అతికించండి కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టించండి
జై తెలంగాణ !! జై కిసాన్ !! జై భారత్ !!
🍁🍁🍁🍁🍁🍁





Reader Comments
Comments are reviewed by our desk before they appear. Sign in with your mobile number to join the discussion.